లాక్డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. చాాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు. ఇంట్లోనే వ్యాయామాలు చేస్తున్నారు. అయితే ఇంటి దగ్గర చేసే వ్యాయామాలు వల్ల గాయపడే ప్రమాదం ఎక్కువ ఉన్నందున తగిన జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు.
బార్బెల్ బాస్ వ్యవస్థాపకుడు, జాతీయ వెయిట్ లిఫ్టర్, వ్యాయామ నిపుణుడు ప్రదీప్ మౌర్య సూచించిన కొన్ని చిట్కాలు మీకోసం..
అనువైన స్థలం
వ్యాయామం చేసేందుకు మీరు ఎంచుకునే స్థలం అనుకూలంగా ఉండాలి. ఇందుకు మీరు ఎంచుకున్న గది, అంతస్తులో ఎటువంటి ఆటంకాలు లేకుండా విశాలంగా ఉండేలా చూసుకోవాలి. ఆ పరిసరాలు ఇరుకుగా ఉండకూడదు. అక్కడ పిల్లలు ఆడుకునే ఆటవస్తువులు, ఫర్నిచర్ ఎక్కువగా లేకుండా చూసుకోవాలి.
పరిమితులు తెలుసుకోవాలి
వ్యాయామం చేస్తున్నప్పుడు శరీరం నుంచి వచ్చే కొన్ని సంకేతాలను తప్పక గమనించాలి. అలా ఎందుకు జరుగుతుందో గుర్తించాలి. దీని వల్ల మీరు మీ శరీరానికి తగ్గట్టు వ్యాయామం చేస్తున్నారా లేదా మోతాదు పెంచుతున్నారా అనేది తెలుస్తుంది. మీ సామర్థ్యానికి మించి వ్యాయామం చేయడం అంత మంచిది కాదు. అందుకు కచ్చితంగా ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఒక్కొక్కరి శరీరతత్వం వేరువేరుగా ఉంటుంది. అందువల్ల మన శరీరానికి తగ్గట్టు వ్యాయామం చేయాలి.
తగినంత వార్మ్ అప్ చేయాలి
కండరాలు ధృడంగా ఉండటం వల్ల గాయాలు అధికంగా అవుతాయి. అందుకు తగిన వార్మ్ అప్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దీని వల్ల గాయాలపాలయ్యే ప్రమాదం తగ్గుతుంది. ఎంత ఎక్కువ వార్మ్ అప్ చేస్తే అంత మంచిది. అందుకు వీలైనంత ఎక్కువగా వార్మ్ అప్ చేస్తూ ఉండండి. ఇందుకు నిపుణులు సూచించే పలు బర్పీలు చేయండి.