Rain Water Is Good To Drink : వర్షపు నీటిని ఉపయోగించి వ్యవసాయం చేసేవారిని చాలామందిని చూసుంటాం. దీంతో పాటు వర్షపు నీటిని వివిధ రకాల పనులకు ఉపయోగించే వారిని కూడా చూసుంటాం. కానీ ఎప్పుడైనా వర్షపు నీటినితాగొచ్చా? అన్న సందేహం మీకు వచ్చిందా! వర్షం నీరు తాగితే ఏమవతుంది అని మీకు అనిపించిందా? తగినన్ని ముందు జాగ్రత్తలతో ఈ నీటిని తాగొచ్చని చెబుతోంది ఆయుర్వేదం. వర్షపు నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని అంటోంది. వాస్తవానికి వాననీరు పలు ప్రయోజనాలు కలిగిస్తుందని ఇతర శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. వర్షపు నీటిని తాగడం వల్ల మానవ శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు ఆయుర్వైద వైద్యురాలు రేఖ రాధామణి. వర్షపు నీటి ప్రయోజనాలతో పాటు వాటిని ఎలా సేకరించాలి? ఎలా మంచినీటిని గుర్తించాలి? లాంటి అనేక ప్రశ్నలకు సోషల్ మీడియాలో సమాధానం ఇచ్చారు.
వర్షపు నీటిని సేకరించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం..
వర్షాకాలం మొదలైన కొద్ది రోజుల తర్వాత నీటిని సేకరించడం మంచిది. ఈ వర్షపు నీటిని సేకరించేందుకు రాగి పాత్రలను ఉపయోగించడం ఉత్తమం. ఇందులో నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సేకరించిన నీటిని.. ఓ గిన్నెలో రాత్రంతా ఉంచాలి. ఆ తర్వాత ఉదయాన్నే వేడి చేసుకుని తాగాలి.
"వర్షం నీరు అమృతం లాంటిది. ఈ నీరు తాగడానికి కూడా రుచిగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం.. ఈ నీటిని తాగితే ఆరోగ్యంగా, అలసట లేకుండా ఎక్కువ కాలం జీవిస్తారు. అయితే, కలుషిత ప్రాంతాల్లో ఈ నీటిని తాగడం మంచిది కాదు. ముఖ్యంగా దిల్లీ లాంటి అత్యంత కాలుష్య నగరంలో వర్షపు నీటిని తాగడం అంత మంచిది కాదు. దిల్లీ ప్రజలు వర్షపు నీటికి దూరంగా ఉండడం శ్రేయస్కరం. దుబాయ్.. లాంటి ప్రాంతాల్లో ఏడాదికి ఒకసారి వర్షం పడుతుంది. అలాంటి ప్రదేశాల్లో నివసించే ప్రజలు కూడా ఈ నీటిని తాగడం మంచిది కాదు."