ఊబకాయం ఓ ఊబిలాంటిది. ఒక్కసారి దానిలోకి జారిపోవడం మొదలుపెట్టాం అంటే.. మన జీవితం అదుపు తప్పి ప్రమాదాల బాట పట్టినట్లే. ఇవాళ హైబీపీ, సుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం, కీళ్ల నొప్పులు లాంటి ప్రమాదకర ఉపద్రవాలకు మోయలేని బరువు అనేది ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా ఓ కారణంగా ఉంటుంది. అందుకే ఊబకాయాన్ని వ్యాధుల కుంపటిగా, జబ్బులకు రాచబాటగా పరిగణిస్తున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో తినే ఆహారం విషయంలో (Diet Plan For Weight Loss) అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. తిన్న ఆహారాన్ని ఖర్చు పెట్టడం కూడా అంతే ముఖ్యం.
Diet Plan For Weight Loss: ఒంట్లో కొవ్వు కరిగించాలా? ఇవి తినండి...
రోజూ మనం ఏం తింటున్నాం..? ఎలా తింటున్నాం..? ఈ రెండు విషయాలపై అవగాహన లేకపోతే, ఆహారపు అలవాట్లు గాడి తప్పితే.. మన శరీరం మన మాట వినడం మానేస్తుంది. ఒంట్లో కొవ్వు నిల్వలు పేరుకుపోతూ.. చివరకు కొండలా మారిపోతుంది. ఒక్కసారి స్థూలకాయం బారిన పడ్డాక దానిని తగ్గించుకోవడం కోసం చాలా తిప్పలే పడాల్సి ఉంటుంది. స్థూలకాయంతో బాధపడుతున్నప్పుడు పాటించాల్సిన ఆహార నియమాల (Diet Plan For Weight Loss) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆహారంతోనే బరువుకు చెక్ పెట్టండిలా
ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
- కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
- మాంసకృతులు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
- తాజా పండ్లు, కూరగాయలను తరుచూ తీసుకుంటూ ఉండాలి.
- వంటల్లో ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం ఉత్తమం. దీంతో మన రక్తంలో మంచి కొలెస్ట్రాల్స్ పెరుగుతాయి.
- తృణధాన్యాలను తీసుకోవడం కూడా శరీరానికి చాలా మంచిది.
- రోజూ ఒక యాపిల్ పండును తినడం మంచిదన్నది వైద్యుల మాట.
- టమాటాలు ఆహారంగా తీసుకోవడం కూడా మంచిది. దీనిలో విటమిన్ సీ తో పాటు యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిని నిత్యం సూప్, పప్పు, సలాడ్, పండు రూపంలో తీసుకుంటే బరువు త్వరగా తగ్గుతారు.
- స్వీట్లు, రైస్‌ను వీలైనంత వరకు తగ్గించాలి. డ్రై ఫ్రూట్ లాంటి వాటిని తీసుకోవచ్చు.
- జామ, బొప్పాయి, పుచ్చకాయ లాంటి వాటిని తీసుకుంటే ఎక్కువ కొవ్వు చేరదు.
- గోరువెచ్చని నీటిలో నిమ్మకాయి, తేనే వేసి పరగడుపునే తీసుకుంటే మంచిది.
- ఉదయం అల్పాహారాన్ని ఎట్టిపరిస్థితుల్లో తినకుండా ఉండకూడదు.
- దాహం వేసినా, వేయకున్నా.. తరచూ నీరు తాగుతూ ఉండాలి. మంచినీరు బరువు తగ్గడానికి బాగా తోడ్పడుతుంది.
- క్యారెట్, బీట్రూట్ జ్యూస్‌లు తీసుకోవడం బరువు తగ్గాలి అనుకునే వారికి చాలా మంచిది.
- తరచూ బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ తాగాలి.
ఇదీ చూడండి:'క్యారెట్ రసం'తో కాలేయం పదిలం