Diet For High BP Patients : ఆరోగ్యంగా ఉండాలంటే రక్తపోటును నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. రక్తపోటు తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి, రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రక్తంలో ఉప్పు శాతం పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు రక్తపోటు మారుతుంటుంది. దీన్ని నియంత్రించుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. మరి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హైబీపీతో బాధపడుతున్నవారికి వైద్యులు మందులు సూచిస్తారు. వీటితోపాటు ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలని చెబుతారు. ఉప్పు కారణంగా రక్తంలో ఫ్లూయిడ్ శాతం పెరుగుతుంది. అలాగే.. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలను రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తారు. మసాలాలు, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలంటారు. ఇవి సహజంగా చేసే సూచనలు. వీటితోపాటు.. మరికొన్ని ఆహార మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఫ్యాటీ ఫిష్..
సాల్మన్, ట్యూనా, మాకెరెల్ వంటి చేపలలో ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫలితంగా బీపీ తగ్గుతుంది.
విత్తనాలు..
అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు అవిసె గింజలు, చియా విత్తనాలు, గుమ్మడి గింజలు తినాలి. ఎందుకంటే.. వీటిలో పొటాషియం, మెగ్నీషియం కంటెంట్ అధికంగా ఉంటుంది. దీంతో రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండి.. బీపీ స్థిరంగా ఉంటుంది.
మీరు ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - మీ పేగుల్లో విషం నింపుతునట్టే!
గుడ్డు తెల్లసొన..
హై-బీపీతో బాధపడుతున్నవారు గుడ్డులోని తెల్లసొన తినాలి. ఇందులో ఉండే ప్రొటీన్ కంటెంట్.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో హైపర్‌టెన్షన్ తగ్గుతుంది.