తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

నడుము నొప్పికి మందులు వాడుతున్నారా..? అయితే ప్రమాదమే..!

ఇటీవల కాలంలో చాలామంది నడుము నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్లు ఈ సమస్యతో సతమతం అవుతున్నారు. అయితే నడుము నొప్పి సమస్యను తగ్గించుకునేందుకు ఎక్కువగా మందులు వాడటం వల్ల సైడ్​ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెబుతున్నారు వైద్యులు. మందులతో కాకుండా సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చని అంటున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం రండి..

Causes and Precautions to be taken for back pain
నడుము నొప్పి

By

Published : Jan 28, 2023, 7:09 AM IST

నడుము నొప్పి

ఆధునిక జీవన శైలిలో తలెత్తే సమస్యలలో నడుము నొప్పి ఒకటి. గంటల తరబడి కూర్చుని పని చేయటం వల్ల నడుము నొప్పి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ అధికం అవుతోంది. ముఖ్యంగా ఆడవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపోస్తుంది. దీంతో ఈ నొప్పిని తగ్గించుకునేందుకు మందులు వాడటం మొదలు పెడుతున్నారు. మందులకు అలవాటుపడిన తర్వాత వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అన్న అనుమానాలతో వ్యాయామంపై మొగ్గు చూపుతున్నారు. నడుము నొప్పి ఎందుకు వస్తుంది? నడుము నొప్పి రాగానే ఏం చేయాలి? ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి? వంటి అంశాల గురించి నిపుణులు కొన్ని సలహాలు, సూచనలను ఇచ్చారు. అవేంటంటే?..

నడుము నొప్పి రావటానికి గల కారణాలు
సాధారణంగా నడుము నొప్పి ఎక్కువగా కూర్చుని పని చేయటం వల్ల వస్తుంది. కొంతమందిలో డిస్క్ లోపం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. నడుములో ఎముకల మధ్య గ్యాప్ ఏర్పడి పక్కకి జరగటం, ఒకే పనిని ఎక్కువగా చేయటం, ఎక్కువగా ప్రయాణాలు చేయటం, నడుము దగ్గర ఏదైనా దెబ్బతగలటం, విటమిన్ల లోపం వల్ల నడుము నొప్పి వచ్చే అవకాశాలున్నాయి. కొంతమంది ఆడవారిలో నెలసరి సమయంలోనూ ఈ సమస్య తలెత్తుతుంది. కొంతమందిలో అయితే కండరాల బలహీనత, అధిక బరువు వల్ల ఈ సమస్య వస్తుంది.

నివారణ మార్గాలు
నడుము నొప్పి వచ్చిన వెంటనే డాక్టర్​ను సంప్రదించటం ఉత్తమం. నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకుని దానికి తగిన విధంగా చికిత్స తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. కొంతమందిలో ఏ ప్రాబ్లమ్ లేకపోయినా ఎక్కువగా కూర్చోవటం వల్ల వారు ఈ సమస్య బారిన పడతారు. సమస్య వచ్చిన వెంటనే మందులను వాడటం మంచిది కాదు. మందులకు అలవాటు పడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలున్నాయి.

నడుము నొప్పికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • ఆఫీసులో ఒకేచోట ఎక్కువగా కూర్చునేటప్పుడు, నిల్చునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యేకించి కంప్యూటర్ల ముందు కూర్చునే వాళ్లు ఒక మంచి కుర్చీని ఎంపిక చేసుకోవటం ఉత్తమం. లేదంటే నడుము నొప్పి ఎక్కువయ్యే అవకాశం ఉంది.
  • నడుము నొప్పిని నివారించేందుకు మంచి చెప్పుల ఎంపిక చాలా ముఖ్యం. చాలా మంది ఎత్తుమడమల చెప్పులు వేసుకోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. అందుకే తక్కువ ఎత్తు ఉన్న చెప్పులను వాడాలి. లేకుంటే నడుముపై ఒత్తిడి పెరిగి నొప్పి అధికమయ్యే అవకాశాలున్నాయి. ఒక అంగుళం ఎత్తు మడమ ఉన్న చెప్పులను వాడితే మంచి ఫలితం ఉంటుంది.
  • కొద్దిమందిలో ఎముకలు బలహీనంగా ఉండటం వల్ల నడుము నొప్పి వస్తుంది. అందువల్ల డాక్టర్ సలహా మేరకు కాల్షియం, విటమిన్ డీ టాబ్లెట్స్ వాడితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
  • మనం తినే ఆహారంలో పాలు, పాలకూర, వెల్లుల్లి, అల్లం, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని తీసుకోవటం మంచిది.
  • వీటితోపాటు ప్రతి రోజు పావుగ్లాసు పాలలో పది చుక్కల వెల్లుల్లి రసాన్ని కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  • అల్లం రసం, పసుపును పాలలో కలిపి తాగితే నడుం నొప్పి తగ్గుతుంది.
  • ఆవనూనె, నువ్వుల నూనె వేడి చేసి నడుముకు మర్దనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • నడుము నొప్పి ఉన్న వారు వంకాయ, వేరుశనగ నూనె, పెరుగు, మినప పదార్థాలను ఆహారంలో ఎక్కువగా తీసుకోవటం మంచిది కాదు.

ABOUT THE AUTHOR

...view details