భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని దృఢం చేసే అంశాల్లో శృంగారానిది కీలక పాత్ర అని చెప్పొచ్చు. వైవాహిక జీవితంలో లైంగిక సంబంధం ఎంతో ముఖ్యం. ఇది సరిగ్గా ఉంటే ఇతర వ్యవహారాలు సక్రమంగా సాగుతాయి. అయితే సెక్స్‌కు సంబంధించి కొన్ని సందేహాలు, అనుమానాలు, అపోహలు చాలా మందికి ఉంటాయి. అయితే ఆలస్యంగా పెళ్లి చేసుకున్నవారిలో అవి మరింత ఎక్కువగా ఉంటాయి.
అసలే ఆలస్యంగా పెళ్లి జరిగింది!.. శృంగారాన్ని ఆస్వాదించగలమా?.. భాగస్వామిని సంతృప్తి పరచగలమా? సెక్స్ హార్మోన్లు స్పందిస్తాయా? ఎక్కువ సేపు సెక్స్‌లో పాల్గొనగలమా? అలా ఇలాంటి అపోహలతో సతమతవుతుంటారు. వాటిన్నింటిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే.. శృంగారం ఇబ్బందులు తప్పవా? "సాధారణంగా శరీరానికి వృద్ధాప్య దశ వస్తుంది కానీ మనసుకు రాదు. మనసులో సెక్స్ పరంగా ఎప్పుడూ స్పందనలు ఉంటాయి. అందుకు సంబంధించిన హార్మోన్లు కూడా చక్కగా పనిచేస్తూనే ఉంటాయి. దాని వల్ల ఏ వయసులోనైనా సెక్స్‌ను చక్కగా ఆస్వాదించొచ్చు. ఆలస్యంగా పెళ్లి చేసుకున్న వారు.. వయసులో ఉన్న వారిలా ఎక్కువసేపు, అనేక సార్లు పాల్గొనలేకపోవచ్చు కానీ శృంగారంలో ఎంజాయ్ చేయొచ్చు."
-- నిపుణులు
"మగవాళ్లయితే 70 ఏళ్లు వచ్చినా, 80 ఏళ్లు వచ్చినా శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటే శృంగారంలో పాల్గొని ఆస్వాదించొచ్చు. దాంతో పాటు సినాఫిల్ వంటి మాత్రలు వాడితే మరింత ఎంజాయ్ చేయవచ్చు. ఆడవాళ్లలో కూడా ఆరోగ్యం చక్కగా ఉంటే ఎంత వయసు పెరిగినా శృంగారంలో థ్రిల్ పొందవచ్చు." అని నిపుణులు చెబుతున్నారు.
వారితో సెక్స్ విఫలం.. ఎందుకు? మనసు పడిన అమ్మాయితో శృంగారంలో పాల్గొనాలని ఎందరో కలలు కంటారు. తీరా ఆ సమయం వచ్చేసరికి కంగారుతో, అమ్మాయిని మెప్పించగలనా లేదా అనే అనుమానంతో సెక్స్‌లో ఫెయిల్ అవుతుంటారు. దీంతో మరింత ఒత్తిడికి గురవుతారు పలువురు అబ్బాయిలు. ఇలా ఎందుకు జరుగుతుంది? మనసు పడిన అమ్మాయి దగ్గరు ఎందుకు విఫలమవుతారు? దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే?
మనసు పడిన అమ్మాయి దగ్గర ఫెయిల్ అవడం అనేది సాధారణంగా యాంగ్జైటీ డిజార్డర్ (anxiety disorder) కారణంగా జరుగుతుంది. తనని ఇష్టపడుతున్న అమ్మాయిని సెక్స్‌లో మెప్పించగలనా? ఆమె అంచనాలను అందుకోగలనా అనే కొద్ది పాటి అనుమానం వచ్చినా.. ఫెయిల్ అవడానికి ఆస్కారం ఉంటుంది. సెక్స్ విషయంలో ఏమాత్రం అనుమానం, భయం, కంగారు ఉన్నా.. అంగం స్తంభించదు.
'ఎప్పుడైనా సెక్స్‌లో సందేహం రాగానే.. స్ట్రెస్ హార్మోన్స్ విడుదలవుతాయి. అప్పుడు పురుషాంగం గట్టిపడటానికి కావాల్సిన రక్తం పురుషాంగంలోకి వెళ్లదు. స్ట్రెస్ హార్మోన్స్ అంగం గట్టిపడకుండా చేస్తుంది. దీనికి మూలం అనుమానం, భయం, కంగారు, గాబరా. వీటిని యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. ఇది మనసు పడిన అమ్మాయితో సెక్స్‌లో పాల్గొన్నా, ఓ అమ్మాయి మనసు పడినా.. ఇదే జరుగుతుంది. అందువల్ల మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉండాలి. మనసులో ఏమూల కూడా డౌట్ లేకపోతే చక్కగా చేయగలుగుతారని' నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి:గుండె నొప్పి ఉన్నవారు శృంగారానికి దూరంగా ఉండాలా?
మనసు పడిన అమ్మాయితో.. శృంగారంలో ఎందుకు విఫలమవుతారు?