తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

healthy diet: దీంతో మన బరువు కంట్రోల్!

రోజూ అన్నం తింటే బరువు పెరుగుతాం అంటారు కొందరు. షుగర్‌ పెరిగిపోతుందంటారు ఇంకొందరు. దీనికి పరిష్కారంగా బ్రౌన్‌ రైస్‌(brown rice benefits) తీసుకోవచ్చు.

Brown Rice: Health Benefits, Nutrients per Serving
బ్రౌన్ రైస్

By

Published : Sep 26, 2021, 4:11 PM IST

బ్రౌన్‌రైస్‌లో(brown rice benefits) పీచు ఎక్కువ. ఇది గుండె కవాటాలు మూసుకుపోకుండా చేస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్‌ దాటిన మహిళల్లో ఈ సమస్యను రానివ్వదు. చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి బరువూ అదుపులో ఉంటుంది.

* ఈ బియ్యంలో(brown rice benefits) గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ స్థాయులు తక్కువ. కాబట్టి తిన్న తరవాత చాలా ఆలస్యంగా జీర్ణమవుతాయి. అలా రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. ఇందులో(brown rice calories) ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు రోజూ శరీరానికి అందడం వల్ల పెద్దపేగూ, రొమ్ము వంటి క్యాన్సర్లు వచ్చే అవకాశాలు కూడా చాలా మటుకు తగ్గుతాయట.

* ఈ బియ్యంలో(brown rice benefits) ఉండే విటమిన్లూ, ఖనిజాలతోపాటూ ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని అందిస్తాయి. దాని వల్ల శరీరంలో పేరుకున్న ఫ్రీ రాడికల్స్‌నీ, వ్యర్థాలనూ బయటకు పంపిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల వార్థక్యపు ఛాయలు కూడా త్వరగా దరిచేరవు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details