Blue Tea Health Benefits: చాలామందికి పొద్దున లేవగానే టీ తాగనిదే రోజు మొదలు కాదు. గ్రీన్ టీ, జింజర్ టీ, బ్లాక్ టీ, మసాలా టీ అంటూ ఎన్నో వెరైటీలను ఆస్వాదిస్తుంటారు. మరి.. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న 'బ్లూ' టీ(Blue Tea) గురించి మీకు తెలుసా? కేవలం టేస్ట్ మాత్రమే కాదు.. దీంతో అంతకు మించిన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయట. మరి.. ఈ Tea ఎలా తయారు చేసుకోవాలి? బ్లూ టీతో కలిగే బెనిఫిట్స్ ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
మెడ నల్లగా ఉందని బాధపడుతున్నారా? - ఈ టిప్స్ ట్రై చేశారంటే తెల్లగా మారడం ఖాయం!
Butterfly Pea Flower Tea Benefits :బ్లూ టీనే బటర్‌ఫ్లై పీ ఫ్లవర్ టీ అని కూడా అంటారు. దీనిని శంఖు పువ్వుతో తయారు చేస్తారు. శంఖుపుష్పాన్ని దేవతార్చనలో ఎక్కువగా వాడుతుంటారు. శుంఖుపుష్పాన్ని అపరాజిత, గిరికర్ణిక, దింటెన అనే పేర్లతోనూ పిలుస్తుంటారు. ఈ పుష్పాన్ని పూజలో ఎంత ప్రవిత్రంగా భావిస్తారో ఆయుర్వేదంలోనూ అంతే ప్రత్యేకంగా చూస్తారు. ఆయుర్వేద వైద్యంలో ఎన్నో అనారోగ్యాల చికిత్సకు శంఖుపుష్పాన్ని వాడుతూ ఉంటారు. శంఖుపుష్పాల టీని తరచుగా తీసుకుంటే.. అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ టీని ఎండిన శంఖుపుష్పాలతో తయారు చేస్తారు. ఈ టీ నీలం రంగులో ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో ఆంథోసైనిన్ సమృద్ధిగా ఉండటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి.
అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? - ఈ ఆహారాలు ఔషధం!
- ఈ Teaలో ఫినోలిక్ యాసిడ్, ఫినాలిక్ అమైడ్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మెండుగా ఉంటాయి. ప్రతిరోజూ ఈ టీ తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- బ్లూ టీ తాగడం వల్ల వాంతులు, వికారం నుంచి ఉపశమనం పొందవచ్చు.
- బ్లూ టీలో ఉంటే యాంటీ గ్లైసటీన్ ప్రాపర్టీస్ వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముడతలు రాకుండా యవ్వనంగా కనిపిస్తారు.
- బ్లూ టీలోని ఆంథోసైనిన్ కారణంగా జుట్టు రాలడం తగ్గుతుంది.
- షుగర్ పేషెంట్స్ రెగ్యులర్ టీ కాకుండా బ్లూ తాగితే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.