కావాల్సినవి:అర టీస్పూన్ మిరియాలు, పావుస్పూన్ జీలకర్రను బరకగా పొడిచేసి పెట్టుకోవాలి. పసుపు- పావుస్పూన్, బెల్లంపొడి- అర టీస్పూన్, పల్చటి చింతపండు రసం- పావుకప్పు, కొత్తిమీర- కొద్దిగా, నెయ్యి- టీస్పూన్, టొమాటో- ఒకటి (మెత్తగా పేస్టు చేసి పెట్టుకోవాలి).
జలుబా.. ఇదిగో మిరియాల రసం తాగండి...
జలుబూ, దగ్గుతో ఏ కాస్త ఇబ్బందిపడ్డా వెంటనే మిరియాల పాలు తాగేస్తాం. అలాగే వీటితో రసాన్ని కూడా తయారుచేసుకోవచ్చు. దీన్ని తీసుకుంటే జలుబూ, దగ్గుల నుంచే కాకుండా గొంతు నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఎన్నో ఉపయోగాలున్న దీన్ని ఎలా చేయాలో చూద్దామా...
black pepper
పోపుకోసం:కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి
తయారీ:గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసి దీంట్లో టొమాటో పేస్టు, చింతపండు రసం, పసుపు, మిరియాలు, జీలకర్ర, బెల్లంపొడి, సరిపడా ఉప్పు వేసి కాసేపు మరగనివ్వాలి. ఇలా మరుగుతుండగానే ఇంగువ, కొత్తిమీర తురుము వేసి కాసేపు చిన్నమంట మీద ఉంచాలి. కడాయిలో నెయ్యి వేసి వేడిచేసి ఆవాలు, ఎండుమిర్చి వేసి చిటపటలాడగానే రసంలో కలపాలి. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే గొంతు నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.