Best Tips to Get Rid of Cockroaches and Lizards Natural Ways :సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు.. క్రిములు, కీటకాలు విపరీతంగా పెరుగుతుంటాయి. వీటితో పాటు చీమలు, దోమల బెడద ఎక్కువగానే ఉంటుంది. సహజంగా కొందరు ఈ చీమలు,దోమలు(Mosquitos) కుట్టినా అంత పట్టించుకోరు కానీ.. ఇంట్లో ఎక్కడో దూరంగా గోడమీద పాకే బల్లి, వంటింట్లో తిరగాడే బొద్దింకను చూస్తే.. నార్మల్‌గా ఉండలేరు.
Best Tips to Get Rid of Cockroaches and Lizards :బొద్దింకలు(Cockroaches), బల్లులతో నేరుగా ఎలాంటి ప్రమాదం లేకపోయినా.. అవి హానికర సూక్ష్మజీవులను తరలించే వాహకాలుగా పనిచేస్తాయి. వీటి సంఖ్య ఎక్కువై ఇంట్లో తిరుగుతుంటే చిరాకుగా ఉంటుంది. పొరపాటున మనం తినే ఆహారంలోకి చొరబడితే దానిని తినలేం. అలాగే ఒకవేళ మనకు తెలియకుండా తింటే రోగాల బారినపడటం గ్యారెంటీ. అందుకే.. చాలా మంది వీటిని చంపడానికి స్ప్రేలు వాడుతుంటారు. కానీ.. ఈ స్ప్రేల వల్ల ఇన్నర్ పొల్యూషన్ పెరిగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా.. పిల్లలు, వృద్ధులు ఉండే ఇంట్లో వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఈ నేపత్యంలో.. కొన్ని సహజ పద్ధుతుల ద్వారా వీటిని తరిమికొట్టొచ్చు. ఇంతకీ ఆ మార్గాలేమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Natural ways to Eliminate Cockroaches and Lizards :
బొద్దింకలు, బల్లులను తరిమికొట్టే సహజసిద్ధ మార్గాలివే..
గుడ్డు పెంకులు :చాలా మంది ఇంట్లో ఎగ్ కర్రీ చేసుకోగానే వాటిని డస్ట్‌బిన్‌లో పారేస్తుంటారు. అయితే.. అలా చేయకుండా ఇంట్లోని తలుపులు, కిటికీలు, వంటగదిలో కొన్ని చోట్ల లేదా ఇతర ప్రదేశాలలో గుడ్ల పెంకులను ఉంచడం ద్వారా బల్లుల బెడద నుంచి తప్పించుకోవచ్చు. ఎందుకంటే గుడ్ల వాసన వాటికి పడదు కాబట్టి అక్కడికి రాలేవు.
వెల్లుల్లి :వెల్లుల్లి, లవంగాల వాసన కూడా వీటికి పడదు. కాబట్టి వెల్లుల్లి లవంగాలను అక్కడక్కడా మీ ఇంట్లో వేలాడదీయండి. అలాగే వెల్లుల్లి రసాన్ని బల్లులు ఉండే ప్రదేశాల చుట్టూ పిచికారీ చేయండి. ఆ వాసనకు అవి పరార్ అవుతాయి.
కాఫీ, పొగాకు పౌడర్ చిన్న బంతులు : కాఫీ, పొగాకు పొడిని చిన్న బాల్స్‌గా చేసి వాటిని అగ్గిపుల్లలు లేదా టూత్ పిక్స్‌పై అతికించండి. ఆ తర్వాత వాటిని అల్మారాలు, బల్లులు తరచుగా కనిపించే ఇతర ప్రదేశాలలో వీటిని వదిలివేయండి. ఈ మిశ్రమం వాటికి ప్రాణాంతకం. అవి చనిపోగానే తీసిపారేయండి.
Viral Infection Remedies : ఇంటి చిట్కాలతో.. వైరల్ ఇన్ఫెక్షన్స్కు చెక్!
ఉల్లిపాయలు :సాధారణంగా మనం ఉల్లిపాయ తొక్కలు బయటపారేస్తుంటాం. కానీ ఆ ఉల్లిపాయల ఘాటైన వాసన కూడా ఈ జీవులకు నచ్చదు. కాబట్టి మీరు మీ ఇంట్లో తిరగాడే బొద్దింకలు, బల్లులను తరిమికొట్టేందుకు కొద్దిగా ఉల్లిపాయ రసం పిచికారీ చేయండి. దాంతో అవి ఇంట్లో నుంచి పరార్ అవుతాయి.