తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచే గుమ్మడి.. తిందామా!

ఊపిరితిత్తుల సామర్థ్యాన్నీ... రోగ నిరోధక శక్తినీ పెంచుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరం. అందుకు గుమ్మడి ఎంతగానో తోడ్పడుతుంది. గుమ్మడితో ఇంకా ఏయే ప్రయోజనాలున్నాయంటే...

benefits of Pumpkins in telugu
ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచే గుమ్మడి.. తిందామా!

By

Published : Aug 11, 2020, 11:01 AM IST

దీంట్లో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం, ఐరన్‌, ప్రొటీన్లు, పొటాషియం, ఫాస్ఫరస్‌, విటమిన్‌-ఎ, బి1, బి12, సి, డి, ఫ్లవనాయిడ్లు, కెరోటినాయిడ్లు ఉంటాయి.

  • ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ముప్పు నుంచి కాపాడతాయి.
  • దీన్ని తరచూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్ఛు
  • గుమ్మడిని తినడం వల్ల ఛాతి నొప్పి వచ్చే అవకాశాలు తగ్గుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
  • దీంట్లో అధికంగా ఉండే బీటాకెరోటిన్‌ గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
  • జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. దీన్ని తరచుగా తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్ఛు
  • నిద్రలేమితో బాధపడేవారికి ఇది చక్కని ఔషధంగా పనిచేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details