Ayurvedic treatment for back pain: కరోనా కారణంగా చాలామంది 'వర్క్ ఫ్రమ్ హోం'కు అలవాటుపడ్డారు. గంటల తరబడి అలా కూర్చుని పనిచేయడం వల్ల అనేకమందికి నడుం నొప్పి సమస్య తీవ్రంగా వేధిస్తుంటుంది. మరి ఎలాంటి మందులు వాడకుండా ఇంట్లోని ఔషధాలతోనే ఆయుర్వేద పద్ధతిలో నడుంనొప్పిని మాయం చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్థాలు..
ఆముదం, నువ్వుల నూనె, వావిలాకు, ముద్దు కర్పూరం
తయారీ ఎలా..?
- ఆముదం, నువ్వుల నూనె, వావిలాకు, ముద్దు కర్పూరంను సమభాగాలుగా తీసుకోని కషాయంగా కాచాలి.
- ఆ తర్వాత నూనె మాత్రమే మిగిలాక నిత్యం కాపడం పెట్టాలి.
- నొప్పి ఉన్న దగ్గర ఈ నూనెతో మసాజ్‌లా చేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల నడుంనొప్పి క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
రెండో విధానం..
వావిలాకు, మునగాకు, చింతాకు.. ఈ మూడింటిని తీసుకుని కషాయంగా కాచాలి. రోజూ ఉదయం, సాయంత్రం నీటితోగానీ, తేనెతోగాని కలిపి తీసుకోవాలి.
చింతాకు, వావిలాకు, మునగాకు, తెల్లగలిజేరు, గుంటగరగరాకు.. వీటికి మన ఒంట్లో వాతాన్ని తగ్గించే గుణం ఉందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ ఆకులకు కొద్దిగా పసుపును కలిపి నీటిలో వేసి వేడిచేయాలి. ఆ నీటితో వెన్నుపై నిత్యం కాపడం పెట్టాలి. నడుంలో నొప్పి క్రమంగా తగ్గుతుంది.
అలాగే మర్రిచెట్టు పాలతో బాగా తడిపిన వస్త్రాన్ని నడముపై పట్టులాగా వేస్తుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
అంతేకాక ఆయుర్వేద చికిత్సలైన ఘటివస్తి, సర్వాంగధార, స్నేహకర్మ, పంచకర్మ, స్వేధనం లాంటి ప్రక్రియలతో చికిత్స చేస్తే నడుము నొప్పి తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. నడుము నొప్పిని నివారించేందుకు ఎల్లప్పుడూ బరువును నియంత్రణలో ఉంచుకోవాలని అంటున్నారు. నిత్యం వ్యాయామం ద్వారా నడుము నొప్పి బారినపడే అవకాశం తగ్గిపోతుందని చెబుతున్నారు.
ఇదీ చూడండి:Weight Loss Tips: పెద్దగా కష్టపడకుండానే బరువు తగ్గేయండిలా!