తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

చర్మం పొడిబారిపోతుందా? ఈ చిట్కా ట్రై చేయండి..

Ayurvedic Remedies For Dry Skin: చాలా మందికి మృదువుగా ఉండాల్సిన చర్మం పొడిగా మారిపోతుంటుంది. క్రీమ్స్​, లోషన్లు వంటివి వాడినా మార్పు కనిపించకపోవచ్చు. అయితే ఆయుర్వేదంలో ఇందుకు చక్కటి పరిష్కారం ఉందంటున్నారు నిపుణులు. మరి అదేంటో తెలుసుకుందాం.

ayurvedic remedies
ఈ చిట్కా ట్రై చేయండి..

By

Published : Feb 14, 2022, 8:51 AM IST

Ayurvedic Remedies For Dry Skin: చర్మం పొరల్లోని శ్వేధగ్రంధులు, తైలగ్రంధులు.. చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇవి సక్రమంగా పనిచేయనప్పుడే ఈ చర్మం పొడిబారడం అనే సమస్య వస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. తినే ఆహారంలో కారం, మసాల వంటివి ఎక్కువగా ఉండటం, స్మోకింగ్​ అలవాట్లు.. ఇలా వివిధ కారణాల వల్ల ఈ సమస్యను ఎదుర్కొంటారని చెప్పుకొచ్చారు. కానీ ఆయుర్వేదంలోని ఈ చిట్కా పాటిస్తే ఈ సమస్యకు సులువుగా పరిష్కారం లభిస్తుందని సూచిస్తున్నారు.

కచ్చూరాలు, వట్టివేర్లు, పసుపు, చందనం, మంజిష్ట, పెసరపిండితో చేసిన మిశ్రమం ఇందుకు ఔషధంలా పనిచేస్తుందంటున్నారు.

తయారీ విధానం - సుగంధ ద్రవ్యాలైన కచ్చూరాలు, వట్టివేర్లు, పసుపు, చందనం, మంజిష్టలను చూర్ణం చేసి 50 గ్రాముల చొప్పున తీసుకోవాలి. చమటపట్టడం, దుర్వాసన వంటి సమస్యలను దూరం చేసే ఔషధ గుణాలు ఉన్న ఈ మూలికలు చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ మిశ్రమంలో పావు కిలో పెసరపిండిని కలుపుకోవాలి. పెసలతో చేసినది లేదా పెసరపప్పుతో చేసినదైనా వాడుకోవచ్చు. సెనగపిండిని వాడుకునే అవకాశం ఉన్నా.. దాని వల్ల కొంతమందికి అలర్జీలు వస్తుంటాయి. ముఖ్యంగా సెనగపిండికి జిడ్డును తగ్గించేసే గుణం ఉంది. జిడ్డు తగ్గిపోతే చర్మం మరింత పొడిబారుతుంది. కాబట్టీ పెసరపిండినే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ చూర్ణాలన్నిటినీ కలిపేస్తే మనకి కావాల్సిన ఔషధం రెడీ.

ఎలా వాడాలి?

ప్రతిరోజ స్నానం చేయడానికి గంట ముందు ఒంటికి కొబ్బరి లేదా నువ్వులు నూనె రాసుకుని.. స్నానం చేసేటప్పుడు సబ్బుకు బదులు ఈ మిశ్రమాన్ని ఉపయోగించాలి. వీటిలో కొంచెం పాలు కలుపుకుని స్నానం చేస్తే చర్మం చక్కగా మృదువుగా తయారు అవుతుంది.

ఇదీ చూడండి :Beauty Tips: చారడేసి కళ్ల కోసం.. మాయ చేసే మేకప్!

ABOUT THE AUTHOR

...view details