తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే త్రిఫలాలు తినండి - లివర్ ఆరోగ్యానికి చిట్కాలు

లివర్​.. శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. మనం తినే ఆహారం, ఔషధం, దురలవాట్ల వల్ల శరీరంలోకి ప్రవేశించిన పదార్థాలు వెళ్తాయి. మద్యం సేవించడం, రెడీ మేడ్​ ఫుడ్స్​ తినడం సహా ఎక్కువగా మందులు వాడటం లివర్​ పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా లివర్​ దెబ్బతినే అవకాశం ఉంది. అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే త్రిఫలాలతో ప్రత్యేక పత్య ఆహారాన్ని తయారు చేసుకుని తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

liver health
లివర్​ ఆరోగ్యం

By

Published : Oct 30, 2021, 7:01 AM IST

త్రిఫలాలుగా పేర్కొనే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయలు లివర్​కు యాంటీ ఆక్సిడెంట్స్​లా పనిచేస్తాయని అంటున్నారు నిపుణులు. శరీరంలోని మలినాలను బయటక పంపించే ఈ పదార్థాల ద్వారా లివర్​ దెబ్బ తినకుండా నివారించడం సహా ఆరోగ్యంగా ఉంచొచ్చని చెప్తున్నారు. వీటితో ఔషధ గుణాలు గల ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే..

కావాల్సిన ద్రవ్యాలు- నెయ్యి, పాలు, పసుపు, త్రిఫలాలు, వేపాకుల చూర్ణం, బలావేర్ల చూర్ణం.

పత్యాహారం తయారీ విధానం..

  • ఓ గిన్నెలో నీళ్లు, పాలు పోసి కాచాలి. పాలు ఎంత తీసుకున్నామో అందులో నాలుగో వంతు నెయ్యిని వెయ్యాలి.
  • ఇందులో ఇప్పుడు త్రిఫలాల చూర్ణాన్ని వెయ్యాలి. ఈ మూడింటిని 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఈ త్రిఫలాలు కొత్త కణాల ఉత్పత్తికి తొడ్పడతాయంటున్నారు నిపుణులు.
  • రక్తశుద్ధికి తోడ్పడే వేపాకు చూర్ణం సహా పసుపు 25 గ్రాములు ఆ మిశ్రమంలో కలుపుకోవాలి. ఇందులో అదనంగా బలావేర్ల చూర్ణాన్ని ఓ 25 గ్రాములు కలపాలి.

ఈ ద్రవ్యాలన్నింటిని కలిపి సన్నటి మంటపై కాగనివ్వాలి. నీటి శాతం పోయి కేవలం నెయ్యి మిగిలే వరకు వాటిని కాగనివ్వాలి.

ఈ మిశ్రమాన్ని ఓ అరకప్పు వేడి వేడి పాలల్లో ఓ పెద్ద చెంచా పరిమాణంలో వేసి కలుపుకొని ప్రతిరోజు పరిగడుపునే తీసుకోవాలి. ఇలా రోజు తీసుకుంటే.. లివర్​ ఆరోగ్యంగా ఉంటుంది.

ఇదీ చూడండి:పిల్లలు రాత్రిళ్లు బాగా నిద్రపోతున్నారా? అయితే లావు అవ్వరట!

ABOUT THE AUTHOR

...view details