చెరకురసంతో చర్మకాంతి..
* చెరకురసంలో ముల్తానీ మట్టిని కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పట్టిస్తే చర్మంపై ఉన్న నల్లమచ్చలు తొలగిపోతాయి. ఇందులో ఉండే ఆల్ఫా హైడ్రాక్సిల్ ఆమ్లాలు చర్మకణాలను పునరుజ్జీవింపచేస్తాయి.
* చెరకురసంలో తేనె కలిపి పావుగంటపాటు చర్మానికి మర్దనా చేయాలి.తర్వాత ఇరవై నిమిషాలపాటు ఉంచి కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది.
* కాఫీపొడికి కాస్త చెరకురసాన్ని చేర్చి స్క్రబ్‌లా ఉపయోగిస్తే చర్మం కాంతులీనుతుంది.
* నిమ్మరసం, యాపిల్ జ్యూస్, ద్రాక్షరసం, కొబ్బరి పాలు, చెరకురసాలను సమపాళ్లలో కలిపి చర్మానికి పట్టించాలి. దీనివల్ల వాటిలో ఉండే ల్యాక్టిక్, మాలిక్, సిట్రిక్ ఆమ్లాలు చర్మంపై ఉన్న మొటిమలు, మచ్చలను తొలగించి, ఆరోగ్యంగా తయారుచేస్తాయి.
* బొప్పాయి గుజ్జులో చెరకురసాన్ని కలిపి పట్టించడం వల్ల చర్మం బిగుతుగా తయారవుతుంది.
* నాలుగు చెంచాల చెరకురసానికి రెండు చెంచాల నేతిని చేర్చి, చర్మానికి మర్దనా చేస్తే ఎండ వల్ల కమిలిన చర్మం తిరిగి కొత్త నిగారింపును సంతరించుకుంటుంది.
* లీటరు నీటిలో గుప్పెడు పుదీనా ఆకులు, పావులీటరు చెరుకురసం కలిపి, మరిగించి ఆవిరి పట్టుకుంటే చర్మం తేటగా తయారవుతుంది.
* చర్మాన్ని యవ్వనంగా, బిగుతుగా ఉంచడానికి మామూలు ఐస్‌క్యూబ్‌ల కన్నా చెరకురసంతో తయారయిన ఐస్ క్యూబ్‌లను వాడితే రెట్టింపు ఫలితాలుంటాయి.
* ఎటువంటి పదార్థాలూ కలపకుండా అచ్చంగా చెరకురసాన్నే ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు చర్మానికి పట్టించుకున్నా చర్మం ఆరోగ్యంగా, మృదువుగా తయారవుతుంది.
కురులకు కొత్త కళ..