కొత్త సంవత్సరం వచ్చేసింది. న్యూఇయర్ రెజల్యూషన్‌లో భాగంగా.. ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలని చాలా మంది అనుకుంటారు. కొద్దిరోజులు మద్యం జోలికి వెళ్లకుండా బాగానే గడుపుతారు. కానీ, ఆ తర్వాత జీవితంలో ఏదో పోగొట్టుకున్నామనే భావన మొదలవుతుంది. 'ఈ ఒక్కసారికి ఏం కాదులే' అని మద్యం సేవించడం ప్రారంభిస్తారు. ఇక ఆ జోరు వచ్చే ఏడాది వరకు కొనసాగిస్తూనే ఉంటారు.
అయితే.. ఆల్కహాల్‌ను పూర్తిగా వదిలేస్తే జీవితం నిస్సారమైపోయిందనుకోవడం వట్టి భ్రమేనని వైద్య నిపుణులు అంటున్నారు. మితంగా ఆల్కహాల్ సేవిస్తే స్వల్ప ప్రయోజనాలు ఉన్నది నిజమే అయినా.. పూర్తిగా మానేస్తే అంతకు మించిన లాభాలు ఉన్నాయని చెబుతున్నారు.
హెల్త్ డైజెస్ట్ అనే వెబ్సైట్ శాస్త్రీయ ఆధారాలతో ఆల్కహాల్‌కు దూరంగా ఉంటే కలిగే లాభాల జాబితాను రూపొందించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మద్యం మానేస్తే కలిగే ప్రయోజనాలివే!
⦁ మంచి నిద్ర పడుతుంది.
⦁ గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
⦁ కాలేయంపై ఏ ఇబ్బంది పడదు.
⦁ కొన్నిరకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది.
⦁ చర్మం ఆరోగ్యంగా మారుతుంది.