తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు

యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈఓ గీతారెడ్డి తనిఖీ చేశారు. ప్రధాన ఆలయంలో ఫ్లోరింగ్, నలువైపులా రాజగోపురాలపై కృష్ణశిలతో చేసిన సింహాల ప్రతిమలను పరిశీలించారు. ఆలయ పనుల్లో నాణ్యత పాటించాలని...గుత్తేదారులకు పలు సూచనలు చేశారు.

yadadri temple works inspected by ytda officers and EO
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు

By

Published : Oct 10, 2020, 8:35 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి ఆలయ పునర్మిర్మాణంలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈఓ గీతారెడ్డి పరిశీలించారు. ప్రధాన గర్భాలయంలో చేపడుతున్న ఫ్లోరింగ్ పనులు, ఆలయానికి నలువైపులా ఉన్న రాజగోపురాలను యాడ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఆలయంలో వర్షం నీరు నిలవకుండా చేపడుతున్న కృష్ణశిల ఫ్లోరింగ్ మరమ్మత్తులను, ప్రాకారంలో గల అద్దాల మండపాన్ని , పలు విగ్రహాలను పరిశీలించారు.

కొండపైన నిర్మిస్తున్న పుష్కరిణి, శివాలయంలో కల్యాణ మండపం, ప్రసాదముల తయారీ కాంప్లెక్స్‌లో యంత్రాల విడి భాగాల పనులు, రిటైనింగ్ వాల్, మట్టి తొలగింపు పనులను, ఘాట్ రోడ్డులో ఫౌంటెన్ నిర్మాణం అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొండపైన చేపడుతున్న గ్రీనరీ, మట్టి చదును పనులను తనిఖీ చేశారు. గుత్తేదారులకు పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఎస్ఈ వసంత్ నాయక్, ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'అభివృద్ధి పేరిట అతి పురాతన ఆలయాన్ని తొలగిస్తే ఊరుకోం'

ABOUT THE AUTHOR

...view details