తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రీషుడి ఆలయంలోని అద్దాల మండపానికి హంగులు - yadadri

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. యాదాద్రీషుడి ఆలయ మండపం ప్రాకారంలో నిర్మితమవుతున్న అద్దాల మండపం ఎదుట నల్లరాతితో చెక్కిన సింహ రూపాలు, రేలింగులను బిగిస్తున్నారు.

yadadri temple works in yadadri bhuvanagiri district
యాదాద్రీషుడి ఆలయంలోని అద్దాల మండపానికి హంగులు

By

Published : Sep 30, 2020, 11:44 AM IST

భక్తుల ఆధ్యాత్మికత చింతనకు అనుగుణంగా యాదాద్రి పంచ నారసింహుల సన్నిధిని, వివిధ హంగులతో తీర్చి దిద్దుతున్నారు. నిత్యకైంకర్యాల నిర్వహణలో అద్దాల మండపం నిర్మితమవుతున్న విషయం విదితమే. కృష్ణశిలతో రూపొందించిన అష్టభుజి మండప ప్రాకారంలో ఏర్పాటవుతున్న ఆ మండపం ఎదుట నల్లరాతితో చెక్కిన సింహ రూపాలు, రేలింగులను బిగిస్తున్నారు. హైదరాబాద్​కు చెందిన దాతల సహకారంతో అద్దాల మండపం ఏర్పాటవుతోంది. రాష్ట్రానికే వన్నె తెచ్చేలా పునర్నిర్మితమవుతున్న స్థంభోధ్వవుడి సన్నిధిని తీర్చిదిద్దే క్రమంలో ప్రాకారాలలోను రేలింగ్ ఏర్పాట్లకు యాడా నిర్ణయించింది. ఈ క్రమంలోనే అద్దాల మండపం వద్ద పనులు నిర్వహిస్తున్నారు.

విగ్రహాల పొందికలో మార్పులు..

ఆలయ ప్రాకారాల్లో, వెలుపలి సాలహారాల్లో వైష్ణవ రూపాలతో కూడిన కృష్ణశిల విగ్రహాలను పొందుపరచాలని నిర్ణయించారు. చిన్న జీయర్ స్వామి దిశానిర్దేశంతో తాజాగా చేసిన మార్పులో భాగంగా సంపూర్తిగా శ్రీకృష్ణుడి రూపాలే కాకుండా వైష్ణవతత్వానికి చెందిన రూపాల పొందిక జరగనుందని యాడా నిర్వాహకులు తెలిపారు. ఆ క్రమంలోనే విగ్రహాలు తయారు చేస్తున్నట్లు స్థపతి వేలు అన్నారు.

ఇవీ చూడండి: త్వరలో యాదాద్రిలో ఆర్జిత సేవలు షురూ

ABOUT THE AUTHOR

...view details