యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి జయంత్యుత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పండితుల వేదమంత్రాల నడుమ వివిధ ఘట్టాలను పూర్తి చేశారు. రెండోరోజు రాత్రి మూలమంత్ర జపాలు నిర్వహించి హనుమంత వాహనంపై శ్రీరామావతార అలంకార సేవపై బాలాలయంలో ఊరేగించారు. కరోనా నేపథ్యంలో ఏకాంతంగానే ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.
రెండోరోజు వైభవంగా నారసింహుని జయంత్యుత్సవాలు
నారసింహుని జయంత్యుత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు మూలమంత్ర జపాలు నిర్వహించారు. హనుమంత వాహనంపై స్వామివారిని ఊరేగించారు.
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి జయంత్యుత్సవాలు, యాదాద్రి నరసింహ స్వామి వేడుకలు
నేడు చివరి రోజు కావడం వల్ల సహస్ర కలశాభిషేకంతో ఉత్సవాలకు ముగింపు పలకనున్నారు. ఆళ్వారుల్లో ప్రథములైన నమ్మాళ్వార్ల తిరునక్షత్ర వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి:వంట నూనెల ధరలకు కళ్లెం!