యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. గర్భాలయ ముఖద్వార మండపంపై ప్రహ్లాదచరితం కనువిందు చేయనుంది. స్వామివారు స్వయంభువులుగా వెలసిన కొండ గుహ గర్భాలయ ముఖద్వారంపై... నృసింహావతార ఘట్టాన్ని వివరించే ప్రహ్లాద చరిత్ర పురాణ ఘట్టాల పలకల అమరిక ఇటీవలే పూర్తయింది.
యాదాద్రి గర్భాలయంపై అద్భుత కళాఖండం ఆవిష్కృతం
దేశంలో అద్భుతమైన శిల్ప సౌరభాలతో రూపు దిద్దుకుంటున్న యాదాద్రి దేవాలయంలో మరో అద్భుత కళాఖండం అవిష్కృతమైంది. గర్భాలయ ముఖద్వారంపై ప్రహ్లాద చరిత్ర తెలిపే పంచలోహ దృశ్య రూపాలను కళాకారులు అమర్చారు.
ఆరడుగుల వెడల్పు ఏడు అడుగుల ఎత్తు పంచలోహాలతో కళాత్మకంగా రూపొందించిన 10 ప్యానళ్లను గర్భాలయ ముఖద్వార మండపానికి అమర్చారు. హిరణ్యకశిపుడు మరణం లేకుండా వరం పొందడానికి చేపట్టిన తపోదీక్ష మొదలుకొని... ఇంద్రుడు లీలావతి అపహరణ యత్నం, ప్రహ్లాదుడి జననం, హిరణ్యకశిపునికి బ్రహ్మదేవుడి సాక్షాత్కారం, ప్రహ్లాదుడికి దైవ పరీక్ష, నృసింహుడి ఆవిర్భావం, హిరణ్యకశిపుని వథ... శాంతమూర్తిగా లక్ష్మీనరసింహుడి అవతార దర్శనం... అనంతరం ప్రహ్లాదుడు పట్టాభిషేకం ఘట్టాలు... భక్తులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. పంచలోహ శిల్పాల తయారీలో నిపుణుడైన శిల్ప కళాకారుడు రవీంద్ర చారి ఆధ్వర్యంలో దృశ్య పలకలను రూపొందించారు.
ఇవీ చూడండి:పత్తికి అదనంగా రూ.275 పెంచండి!
TAGGED:
lock down effect