తెలంగాణ

telangana

ETV Bharat / state

అత్యాచారం చేసి హతమార్చారా? - murder

మద్యం దుకాణం నిర్వహిస్తున్న మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. తెలిసిన వారే ఈ ఘటనకు పాల్పడ్డారా? లేక వేరే వ్యక్తులే చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో మహిళ హత్య

By

Published : May 9, 2019, 12:54 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో నిన్న రాత్రి అనుమానాస్పద స్థితిలో ఒక మహిళ మృతి చెందింది. మృతురాలు స్థానికంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తోంది. తెల్లవారేసరికి ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. మృతదేహంపై బట్టలు లేకుండా ఉంది. మద్యం తాగిన వాళ్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? లేక దొంగతనానికి వచ్చిన వారే ఆమెను హత మార్చారా అనేది తెలియాల్సి ఉంది.

అనుమానాస్పద స్థితిలో మహిళ హత్య
అత్యాచారం చేసి చంపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు కారణమైన వారిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు. అనురాధ ఒంటిపై నాలుగు తులాల బంగారం,50 వేల నగదు పోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details