యాదాద్రి క్షేత్ర అభివృద్ధిలో చేపట్టిన శివాలయం పునర్నిర్మాణంలో ప్రవేశ మార్గాల కల్పనకు యాడ దృష్టి కేంద్రీకరించింది. కొండపై ప్రధానాలయం పంచ నారసింహుల సన్నిధికి తూర్పు దిశలోని శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి(శివాలయం) ఆలయాన్ని విస్తరించి పునర్నిర్మిస్తున్నారు. అర ఎకరం పైగా విస్తీర్ణంతో నిర్మితమైన ఆలయ ప్రహరీలో నుంచి వెళ్లేందుకు స్వాగత తోరణం ఉత్తర దిశలో ఏర్పాటు చేస్తున్నారు.
యాదాద్రిలో శివాలయం ద్వారాల ఏర్పాటు - యాదాద్రి భువనగిరి జిల్లా లేటెస్ట్ న్యూస్
యాదాద్రిలో శివాలయ పునర్నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నట్లు ఆలయ స్థపతి ఆనందచారి వేలు తెలిపారు. శివాలయ ద్వారానికి హంగులు తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. ఆలయ ప్రహరీ నుంచి వెళ్లేందుకు స్వాగత తోరణం ఉత్తర దిశలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
యాదాద్రిలో శివాలయం ద్వారాల ఏర్పాటు
ఇక ఆలయానికి తూర్పు దిశలో గల ప్రవేశ మార్గం ద్వారానికి సంప్రదాయబద్ధంగా హంగులను తీర్చిదిద్దే పనులు వేగవంతం చేసినట్లు ఆలయ స్థపతి ఆనందాచారి వేలు తెలిపారు.
ఇదీ చదవండి:ఖమ్మంలో స్కూటీ టిప్పర్ ఢీ... ఇద్దరు మృతి