ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 11 రోజుల పాటు కన్నుల పండువగా వేడుకలు జరగనున్నాయి. విష్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో మొదలయ్యే ఉత్సవాలు... 25 న డోలోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.
కన్నుల పండువగా యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు - లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు కొనసాగే ఉత్సవాలు ఈ నెల 25న ముగుస్తాయి.
ప్రధానాలయ పునర్నిర్మాణం పనులు జరుగుతుండటంతో బాలాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా ముందుగా ప్రధానాలయం గర్భాలయంలో నరసింహునికి పూజలు చేశారు. స్వామి వారి అనుమతితో బాలాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే పదకొండు రోజులు భక్తులతో శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హోమం రద్దు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ గీత రెడ్డి, ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహ మూర్తి, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ఆలయ అధికారులు పాల్గొన్నారు...
ఇదీ చూడండి:యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు రేపే ప్రారంభం