మహాశివరాత్రిని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గల శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. చోళుల కాలం నాటి ప్రాచీన ఉమా మహేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకులకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
రాచకొండల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు - umamaheshwara temple samasthanarayanpoor
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రాచీన ఉమామహేశ్వరాలయం, రాచకొండ గుట్టల్లోని స్వయంభు లింగాన్ని దర్శించుకున్నారు.
భక్తులతో నిండిపోయిన శైవ క్షేత్రాలు
రాచకొండ గుట్టల్లో గుప్తనిధుల తవ్వకాల్లో బయటపడ్డ స్వయంభు శివలింగాన్ని మహాశివరాత్రి సందర్భంగా దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఇదీ చదవండి:వైభవంగా 'ఈశా ఫౌండేషన్' మహాశివరాత్రి వేడుకలు