యాదాద్రిలో సరికొత్తగా నిర్మితమయ్యే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండప నిర్మాణానికి యాడా ప్రణాళికలు రూపొందించింది. రూ.11 కోట్ల వ్యయంతో కొండకింద గండిచెర్వు వద్ద సత్య నారాయణస్వామి వ్రత మండప సముదాయాన్ని నిర్మించతలపెట్టినట్లు ప్రాధికార సంస్థ అధికారులు తెలిపారు. తొలి దఫాలో 45 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ప్లోర్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఒకేసారి 250 జంటలు వ్రతాలు చేసుకునేలా ఏర్పాటు చేయనున్నట్లు యాడా పేర్కోంది.
దీక్షా భక్తుల కోసం..