యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని జగదేవ్ పూర్ చౌరస్తా వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడం వల్ల ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం ముల్కలపల్లికి చెందిన బద్దం నర్సిరెడ్డి, రమణమ్మ దంపతులు ముల్కలపల్లి నుంచి భువనగిరికి బయలుదేరారు. జగదేవ్పూర్ చౌరస్తా వరకు రాగానే దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని హర్యానాకు చెందిన కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ... మహిళ మృతి - yadadri bhuvanagiri district news
ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడం వల్ల ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని జగదేవ్ పూర్ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Breaking News
రమణమ్మ రోడ్డుపై పడడం వల్ల లారీ వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. భార్య తన కళ్ల ప్రాణాలు కోల్పోవడం చూసి భర్త బద్దం నర్సిరెడ్డి గుండెలవిసేలా విలపించాడు. కన్నీరు మున్నీరవుతున్న నర్సిరెడ్డిని చూసి అక్కడున్న వారు చలించిపోయారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం భువనగిరిలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: కాళ్లకల్లో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి