తెలంగాణ

telangana

ETV Bharat / state

వీడియో తీశారు... రిమాండ్​కు వెళ్లారు... - video

యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను ఈవో అనుమతి లేకుండా వీడియో తీసిన వారిని పోలీసుల రిమాండ్​కు తరలించారు. గతనెల 17 న ఆలయ వీడియో తీసి వారి యూట్యూబ్ ఛానల్​లో అప్​లోడ్ చేశారు.

యాాదాద్రి వీడియో తీసిన ఇద్దరికి రిమాండ్

By

Published : Apr 13, 2019, 9:17 AM IST

Updated : Apr 13, 2019, 10:50 AM IST

యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధి పనులు అధికారుల పర్యవేక్షణలో వేగంగా కొనసాగుతున్నాయి. గతనెల 17వ తేదీన యాదాద్రి దర్శనానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆలయ ఈవో అనుమతి తీసుకోకుండా పునర్నిర్మాణ పనులను, ప్రధానాలయాన్ని వీడియో తీసి తమ వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్​లో పొందుపరిచారు. ఈవో ఫిర్యాదు మేరకు పోలీసులు వీడియో చిత్రీకరించిన రాకేశ్, నవీన్​లను అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరిలించారు. వీరు హైదరాబాద్​లోని అంబర్ పేటకు చెందిన వారిగా గుర్తించారు.

యాాదాద్రి వీడియో తీసిన ఇద్దరికి రిమాండ్
Last Updated : Apr 13, 2019, 10:50 AM IST

ABOUT THE AUTHOR

...view details