ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీలక్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో ఆండాళ్ అమ్మవారికి ఉంజల్ సేవను కన్నుల పండువగా నిర్వహించారు. ఉంజల్ సేవ సందర్భంగా.. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉయ్యాలపై అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, తులసి దళాలతో అలంకరించి ఆరాధించారు.
యాదాద్రిలో కన్నుల పండువగా ఉంజల్ సేవ - yadadri news
యాదాద్రి నారసింహుని సన్నిధిలో ఆండాళ్ అమ్మవారికి ఉంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాద్యాలు, వేద మంత్రాల నడుమ ఉంజల్ సేవను నిర్వహించి.. అమ్మవారికి నివేదన సమర్పించారు.
యాదాద్రిలో కన్నుల పండువగా ఉంజల్ సేవ
మేళతాళాలు, మంగళ వాద్యాలు, వేద మంత్రాల నడుమ ఉంజల్ సేవను నిర్వహించి.. అమ్మవారికి నివేదన సమర్పించారు. ఆండాళ్ అమ్మవారిని.. భక్తులు దర్శించుకొని హారతులు ఇచ్చారు.
- ఇదీ చూడండి : SPB Songs: బాలు మళ్లీ రావాలి.. గానామృతాన్ని పంచాలి!