మద్యం అనుకొని ఇద్దరు యువకులు స్పిరిట్ తాగి అనారోగ్యం పాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో చోటు చేసుకుంది. మృతుల్లో ఒకరికి వివాహమై నలుగురు పిల్లలు ఉండగా, మరొకరు అవివాహితుడు. ఇద్దరూ మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. భువనగిరి పట్టణంలోని స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలో షేక్ బాబు, మహమ్మద్ రియాజ్‌లు జాతరలో బొమ్మలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఇంట్లో వాడుకోవడం కోసం రెండు రోజుల కిందట రెండు డ్రమ్ములు స్థానికంగా కొనుగోలు చేశారు. నిన్న డ్రమ్ములు శుభ్రం చేస్తున్న క్రమంలో అందులో అడుగు భాగాన స్పిరిట్ ఉండటాన్ని గమనించారు.
మద్యం అనుకుని స్పిరిట్ తాగి ఇద్దరు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఇద్దరు యువకులు మద్యం అనుకొని స్పిరిట్ తాగి మృతిచెందారు. వారి మృతితో ఇరువురి కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
అది మద్యం అనుకొని ఆ యువకులు తాగేశారు. ఈ రోజు ఉదయం కూడా స్పిరిట్‌ని కొంచెం సేవించారు. కడుపులో విపరీతంగా నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం ఇద్దరూ మృతి చెందారు.వారి మృతితో ఇరు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
ఇవీ చూడండి: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి