యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బంద్ ముగిసింది. ప్రయాణికులు, బస్సులు లేక భువనగిరి బస్టాండ్ వెలవెలబోయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఆర్టీసీ కార్మికుల రాష్ట్ర బంద్కు సంఘీభావంగా భువనగిరి పట్టణంలో నిరసన చేస్తున్న కాంగ్రెస్ నాయకులను భువనగిరి పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. పట్టణంలోని బ్యాంకులు కూడా కార్యకలాపాలు కొనసాగించలేదు. దీంతో బ్యాంక్ ఖాతాదారులు ఇబ్బంది పడ్డారు. బస్సులు నడవకపోవటం వల్ల ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో బంద్ ప్రశాంతం - యాదాద్రి భువనగిరి జిల్లాలో బంద్ ప్రశాంతం
యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్టీసీ బంద్ ముగిసింది. భువనగిరి పట్టణంలో నిరసన చేసిన పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో బంద్ ప్రశాంతం