తెలంగాణ

telangana

ETV Bharat / state

గులాబీ మయమైన భువనగిరి - లోక్​సభ

భువనగిరి లోక్​సభ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకునేందుకు తెరాస కసరత్తు ప్రారంభించింది. పార్లమెంటరీ స్థాయి సన్నాహక సమావేశానికి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ హాజరై శ్రేణులను సమాయత్తం చేయనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సభాస్థలికి చేరుకుని కార్యకర్తలతో సమావేశం కానున్నారు.

సభావేదిక

By

Published : Mar 7, 2019, 1:32 PM IST

గులాబీ మయమైన భువనగిరి

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి పట్టు నిరూపించుకునేందుకు తెరాస సిద్ధమైంది. పార్లమెంట్​ ఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు శ్రేణులను సిద్ధం చేస్తోంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ భువనగిరి లోక్​సభ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు.
20 ఎకరాల ప్రాంగణం
నల్గొండ దారిలోని తుక్కాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేస్తున్న సమావేశానికి 20 ఎకరాల ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు, జనగాం, ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గ నుంచి నేతలు, కార్యకర్తలు తరలి రానున్నారు. సభ వద్ద మహిళలు, పురుషులకు వేరువేరుగా ఏర్పాట్లు చేశారు.


భారీ ఏర్పాట్లు..

కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారి భువనగిరి వస్తున్న కేటీఆర్​కు బ్రహ్మరథం పట్టేందుకు జిల్లా నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. గులాబీ జెండాలతో రోడ్లు నిండిపోయాయి. వరంగల్​ నుంచి కేటీఆర్​ మధ్యాహ్నం భువనగిరి చేరుకోనున్నారు.

ఇవీ చూడండి:జోరుగా తెరాస సమావేశాలు

ABOUT THE AUTHOR

...view details