యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి రైల్వేస్టేషన్లో విషాదం జరిగింది. జనగాంకు చెందిన రాంరెడ్డి, రాధ దంపతులు యాదాద్రి నర్సింహస్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం కోసం రాయగిరి రైల్వేస్టేషన్లో ఎదురుచూస్తున్నారు. నిర్మాణంలోఉన్న ఫ్లాట్‌ఫాం అంచున దంపతులు కూర్చున్నారు. అదే సమయంలో భువనగిరి నుంచి ఆలేరుకు గూడ్స్ రైలు వెళ్తోంది. ప్రమాదవశాత్తు దంపతులిద్దరిని రైలు ఢీకొంది. ఈ ఘటనలో రాంరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. రాధకు తీవ్రగాయాలయ్యాయి.
దైవ దర్శనం చేసుకుని వస్తుండగా ఢీకొట్టిన రైలు - TRAIN ACCIDENTS AT RAYADHURGAM
దైవదర్శనం చేసుకుని తిరిగి వెళ్లే క్రమంలో దంపతులను గూడ్స్ రైలు కబళించింది. ప్రమాదవశాత్తు రైలు ఢీకొని భర్త అక్కడికక్కడే మృతి చెందగా... భార్య తీవ్ర గాయాలపాలైంది.
ప్రయాణికులు సమాచారం అందించగా... 108 సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకున్నారు. రాధను ఆస్పత్రికి తరలించగా... భర్త మృతదేమహం విడిచి రావటానికి నిరాకరించింది. సిబ్బంది అక్కడే రాధకు చికిత్స అందించారు. అనంతరం మెల్లగా నచ్చజెప్పగా... ఆస్పత్రికి వెళ్లేందుకు ఒప్పుకుంది. మొదట జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల హైదరాబాద్‌కి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: 'ఉద్యోగాలు పోతే వారి కుటుంబాలు ఆర్థికంగా చనిపోతాయి'