యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల పరిధిలో పాటిమట్ల గ్రామంలోని దొడ్ల ఎల్లయ్య ఇంట్లో చోరీ జరిగింది. రూ.లక్షయాభైవేల నగదు, నాలుగు తులాల బంగారం అపహరించారు. రోజూవారిలానే తన భార్య పిల్లలతో కలిసి ఎల్లయ్య పొలం పనులకు వెళ్లారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కొడుకు మహేశ్ ఇంటికి రాగా ఇంటి తలుపులు తీసి ఉండడం గమనించి ఇరుగు పొరుగు వారికి పిలిచి చూశాడు.
పట్టపగలే రైతు ఇంట్లో దొంగతనం.. లక్షన్నర నగదు చోరీ - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్త
యాదాద్రి భువనగిరి జిల్లా పాటిమట్ల గ్రామంలో పట్టపగలే ఓ రైతు ఇంట్లో దొంగతనం జరిగింది. దొండ ఎల్లయ్య ఇంట్లో దొంగలు పడి రూ. లక్షయాభైవేల నగదు, నాలుగు తులాల బంగారం చోరీ చేశారు.
పట్టపగలే రైతు ఇంట్లో దొంగతం.. లక్షన్నర నగదు చోరీ
ఇంట్లో దొంగలు పడ్డట్టుగా గ్రహించి తన తండ్రికి సమాచారం అందించాడు. తండ్రి ఇంటికి చేరుకోగానే ఇంట్లో బీరువా పగలగొట్టబడి ఉండడం వల్ల పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. బాధితులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుతున్నట్లు ఏఎస్సై యాదయ్య తెలిపారు.