యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని కాటమయ్య నగర్లోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో చోరీకి పాల్పడ్డారు దుండగులు. దాదాపు నాలుగు తులాల బంగారం, 20 తులాల వెండితో పాటు 5వేల రూపాయల నగదు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. చోరీ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరిస్తున్నారు.
ఆలేరులోని ఓ ఇంట్లో చోరీ - కాటమయ్య నగర్లో చోరీ
యాదాద్రి జిల్లాలోని ఆలేరులో ఓ ఇంట్లో చోరీ జరిగింది. దాదాపు 4 తులాల బంగారం, 20 తులాల వెండి, 5వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు.
ఆలేరులోని ఓ ఇంట్లో చోరీ