తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సాంకేతిక బృందం - Yadadri temple

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సాంకేతిక బృందం పరిశీలించింది. బ్రహ్మోత్సవ మండపం వద్ద పగుళ్లు, వర్షానికి కుంగిన ఫ్లోరింగ్​ తదితర అంశాలపై సమాలోచనలు జరిపారు.

technical team visit Yadadri temple rebuilding work
యాదాద్రి పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సాంకేతిక బృందం

By

Published : Jun 20, 2020, 11:42 AM IST

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సాంకేతిక కమిటీ సభ్యులు శుక్రవారం పరిశీలించారు. బ్రహ్మోత్సవ మండపం వద్ద పగుళ్లు, వర్షానకి కుంగిన ఫ్లోరింగ్​ తీరును చూశారు.

వర్షం నీరు ఎక్కడ నుంచి లోపలికి వెళ్తోంది..? చేపట్టాల్సిన చర్యలు ఏమిటి? తదితర అంశాలపై సమాలోచనలు జరిపారు. సుమారు మూడు గంటల పాటు ఆలయ ప్రాంగణమంతా కలియతిరిగారు. సాంకేతిక కమిటీ సిఫార్సుల మేరకు లోపాల సవరణకు చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో గీతారెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చూడండి:యుద్ధ వ్యూహాలతో శత్రు దేశాలను ఎదుర్కొందాం : సీఎం కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details