తెలంగాణ

telangana

ETV Bharat / state

సమ్మర్​ వచ్చే... సమురాయ్ సరదాలు తెచ్చే - SAMURAI PROGRAMME

వేసవి సెలవులు వచ్చేసాయి. బడులకు టాటా చెప్పి కొందరు సొంతూళ్లుకు బస్సు లెక్కుతుంటే... మరి కొందరు ఈ సెలవుల్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు. వారి కోసమే రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ "సమ్మర్​ సమురాయ్"​ క్యాంపు పేరుతో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపడుతోంది. విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా నృత్యం, నాటికలు, వక్తృత్వ తదతర వాటిలో శిక్షణనిస్తున్నారు.

sumurai-programme

By

Published : Apr 22, 2019, 4:38 PM IST

సమ్మర్​ వచ్చే... సమురాయ్ సరదాలు తెచ్చే

తెలంగాణలోని గురుకులాల్లో విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల కోసం సమ్మర్​క్యాంపు నిర్వహిస్తున్నారు. పలు జిల్లాలకు చెందిన గురుకుల విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. 15 రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో విద్యార్థులకు నృత్యాలతో పాటు, చిత్రలేఖనం, వేదిక్ మ్యాథ్స్ వంటివి నేర్పిస్తున్నారు.
ఆనందంగా ఉంది
విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ పొందుతున్నారు. వేసవి సెలవులు వృథా కాకుండా శిక్షణ తీసుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని చెబుతున్నారు. చిత్రలేఖనం, నృత్యాలలో నిపుణులైన అధ్యాపకులతో తర్ఫీదు ఇస్తున్నారు.
240 మందికి శిక్షణ
ప్రస్తుతం 240 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని, ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులు కూడా శిక్షణ శిబిరంలో ఉన్నారని ప్రిన్సిపల్ ఆచార్య తెలిపారు. ఏటా సర్వేల గురుకుల పాఠశాలలో నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాలకు వచ్చి సెలవులను సద్వినియోగం చేసుకుంటామన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details