యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. కొండపై చేపట్టిన పనులన్నింటినీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్న యాడా నిర్ణయంతో సంబంధిత అధికారులు, సిబ్బంది పనులు వేగవంతం చేశారు.
యాదాద్రి ఆలయ మెట్లదారి పునర్నిర్మాణం - stairway to yadadri temple
యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధిలో భాగంగా కొండపైన ఆలయానికి వెళ్లే మెట్ల దారులను పునర్నిర్మిస్తున్నారు. కొండ కింద వైకుంఠ ద్వారం నుంచి ఈ దారి ఏర్పాటవుతోంది.
కాలినడకన ఆలయానికి చేరుకునే వారికో సం కొండపైకి చేరుకునేందుకు మెట్ల దారిని పునర్నిర్మిస్తున్నారు. భక్తులకు ప్రమాదం జరగకుండా ఇరువైపులు గోడ నిర్మాణం జరుగుతోంది. మెట్లెక్కి ఆలయానికి చేరే భక్తులకు ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని చేకూర్చేందుకు గ్రీనరీ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్ర సందర్శనకు ఎప్పుడైనా రావొచ్చని భావిస్తున్న ప్రాధికార సంస్థ నిర్వాహకులు ఆలయంతోపాటు ఈశాన్యదిశలోని సముదాయంలో వసతుల కల్పనకు శ్రమిస్తున్నారు. ప్రధానాలయంలో ఇత్తడి వరుసల పనులను ముమ్మరం చేశారు. స్టెయిన్లెస్ స్టీల్‌తో సముదాయంలో వరుసల నిర్మాణం కొనసాగుతున్నట్లు "యాడా' వైస్ ఛైర్మన్ కిషన్ రావు తెలిపారు.
- ఇదీ చూడండి :పంచారామాలు: శివాయ విష్ణు రూపాయ..