యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. తితిదే తరఫున తిరుమల ముఖ్య అర్చకులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కల్యాణ మహోత్సవం దాదాపు రెండు గంటల పాటు వైభవంగా జరిగింది. అంతకు ముందు స్వామివారు గజ వాహనంపై బాలాలయ తిరువీధుల్లో ఊరేగుతూ కల్యాణ మండపానికి చేరుకున్నారు.
కన్నుల పండువగా యాదాద్రీశుడి తిరుకల్యాణ మహోత్సవం
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బాలాలయంలో స్వామి అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకలో జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ పాల్గొన్నారు.
కన్నుల పండువగా యాదాద్రిశుడి తిరుకల్యాణ మహోత్సవం
వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య అభిజిత్ లగ్న సుముహూర్తమున నరసింహస్వామి, లక్ష్మీ అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. లోక కల్యాణం, జగత్ రక్షణ కోసం స్వామివారు లక్ష్మీదేవి మెడలో మంగళ సూత్రధారణ గావించారని... యాదాద్రి ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. యాదాద్రిశుడి కరుణా కటాక్షాలు అమ్మవారితో పాటు సమస్త లోకాలపై ఉంటాయని అన్నారు.
ఇదీ చదవండి: ఐదోరోజు బ్రహ్మోత్సవాలు.. పొన్న వాహన సేవలో యాదాద్రీశుడు