తెలంగాణ

telangana

ETV Bharat / state

చీపురు పట్టిన సర్పంచ్ - swacha bharat

ఎన్నికల ముందు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అన్న రాజకీయ నాయకులను చూశాం. ఈ సర్పంచ్ మాత్రం చెప్పింది చేస్తున్నాడు. గెలిచాక హామీల అమలుపై దృష్టిపెట్టాడు. తానే చీపురు పట్టి గ్రామాన్ని శుభ్రం చేసి స్వచ్ఛత వైపు నడిపిస్తున్నారు పెద్ద కందుకూరు సర్పంచ్ బీమగాని రాములు.

గ్రామాన్ని శుభ్రత వైపు నడిపిస్తున్న సర్పంచ్

By

Published : Mar 6, 2019, 7:19 PM IST

గ్రామాన్ని శుభ్రత వైపు నడిపిస్తున్న సర్పంచ్
యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దకందుకూర్​కు చెందిన బీమగాని రాములు ఇటీవల ఎన్నికల్లో సర్పంచ్​గా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టిపెట్టారు. ముందుగా గ్రామాన్ని స్వచ్ఛంగా చేయాలనుకున్నారు.

కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతలతో చూపిస్తూ నెలకు 2 రోజులు ఆ పనికే కేటాయించారు. స్వచ్ఛత సామాజిక బాధ్యత అంటూ ప్రజలకు దిశానిర్దేశం చేస్తూ... స్వయంగా తనతో పాటు పంచాయతీ వార్డు సభ్యులతో కలిసి గ్రామంలో చెత్త తొలగిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.

గ్రామ ప్రజల ఆత్మగౌరవం నిలవడం కోసం అందరూ స్వచ్ఛ పద్ధతులు పాటించాలని ఈ సందర్భంగా కోరారు. పదవి చేపట్టగానే ప్రజలకు దూరంగా ఉండే ప్రజా ప్రతినిధులున్న ఈ కాలంలో ఆయన చూపిస్తున్న చొరవ స్ఫూర్తిదాయకం.

ఇవీ చదవండి: 'రైతే రాజు'

ABOUT THE AUTHOR

...view details