యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం నెమరగోముల సర్పంచ్ ఆముదాల సుమతి, ఉపసర్పంచ్ ఎర్రబోయిన కృష్ణ, పంచాయతీ సెక్రటరీ జాకీర్‌లను తాత్కాలికంగా తొలిగిస్తూ జిల్లా కలెక్టర్ అనితా రాంచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ నిధుల దుర్వినియోగంపై గ్రామస్థుల ఫిర్యాదు మేరకు డీపీవో జగదీష్ విచారణ చేపట్టారు.
నిధుల దుర్వినియోగం.. సర్పంచ్, ఉపసర్పంచ్, కార్యదర్శి సస్పెండ్
పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు యాదాద్రి భువనగిరి జిల్లా నెమరగోముల గ్రామసర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ అయ్యారు. వారిని తాత్కాలికంగా తొలగిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
నిధుల దుర్వినియోగం.. సర్పంచ్, ఉపసర్పంచ్, కార్యదర్శి సస్పెండ్
నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలడం వల్ల పంచాయతీ రాజ్ అధికారుల నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్ వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, మిగిలిన వార్డు సభ్యుల్లో ఒకరిని సర్పంచ్‌గా కలెక్టర్ నామినేట్ చేయనున్నారు. మరొకరిని గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు జాయింట్ చెక్ పవర్ కోసం మరొకరిని నియమించే అవకాశం ఉంది.
ఇవీ చూడండి: ప్రతిరోజూ గ్రామం శుభ్రం కావాల్సిందే: కేసీఆర్