తెలంగాణ

telangana

ETV Bharat / state

'యాదాద్రి అవ్వను అక్కున చేర్చుకున్న అనాథాశ్రమం' - OLD WOMEN

ఎవరూ లేని అనాథ వృద్ధులకు నేనున్నాను అంటోంది సహృదయ అనాథ వృద్ధాశ్రమం. గత పది సంవత్సరాలుగా ఒంటరిగా జీవనం సాగిస్తున్న అవ్వకు చేయూతనిచ్చింది యాదాద్రిలోని ఆశ్రమం.

'యాదాద్రి అవ్వను అక్కున చేర్చుకున్న అనాథాశ్రమం'

By

Published : Jun 25, 2019, 3:11 PM IST

'యాదాద్రి అవ్వను అక్కున చేర్చుకున్న అనాథాశ్రమం'

యాదాద్రి భువనగిరి జిల్లాలో గోశాల ప్రాంగణంలో అవ్వ భిక్షాటన చేస్తూ ఉండేది. ఆమెను సహృదయ అనాథ వృద్ధాశ్రమ నిర్వాహకురాలు యాకూబ్బీ అక్కున చేర్చుకుని ఆశ్రమంలో చేర్పించారు.

అసలేం జరిగిందంటే...

హైదరాబాద్​ బొల్లారంకు చెందిన వృద్ధురాలు (82) సుమిత్రకు చిన్నతనంలోనే వివాహం జరిగింది. అనంతరం కొంత కాలానికి భర్త కాచయ్య మరో వివాహం చేసుకోవడం వల్ల ఆమెకు నా అనే వాళ్లు లేక ఒంటరి అయ్యింది. సుమిత్ర చేతనైనన్ని రోజులు ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం కొనసాగించింది.

భిక్షాటన చేస్తూ...

వయసు పైబడటం వల్ల పనిచేయడం చేతగాకపోవడంతో గత పది సంవత్సరాలుగా యాదగిరిగుట్టపైకి వచ్చి దేవస్థానం ముందు భిక్షాటన చేస్తూ ఉండేది. ఇంతలో తెలంగాణ ప్రభుత్వం 2015 సంవత్సరంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి చేయాలనే సంకల్పంతో చర్యలు ప్రారంభించింది. ఆ సమయంలో సుమిత్రను గుట్ట కింద ఉన్న గోశాల ప్రాంతానికి తరలించారు.

సహృదయ చేయూతతో:

సరైన తిండి దొరక్క... ఈ అవ్వ మూడు సంవత్సరాల క్రితం కళ్లు తిరిగి పడిపోయింది. తొంటి ఎముక విరిగింది. అప్పటి నుంచి నడవలేని స్థితిలో గోశాల ప్రాంతంలో ఒక చిన్న షెడ్​లో ఎండ, వాన, చలికి తట్టుకుంటూ యాత్రికులు ఏమైనా అన్నం పెడితే తినడం, యాత్రికులు లేని రోజులు పస్తులు ఉంటున్నది. ఇది చూసిన పారిశుద్ధ్య కార్మికుడైన పెంటయ్య సహకారంతో రాయగిరిలో గల సహృదయ అనాథ వృద్ధాశ్రమ నిర్వహకురాలికి సమాచారం ఇచ్చాడు. వెంటనే అవ్వ పూర్తి వివరాలు తెలుసుకున్న నిర్వహకురాలు యాకూబ్బీ... తానే స్వయంగా అవ్వకు స్నానం చేయించి... సహృదయ అనాథ వృద్ధ ఆశ్రమానికి తరలించారు. అనాథలను అక్కున చేర్చుకుని వారికి సేవకల్పిస్తామని... సంస్థ నిర్వహకురాలు తెలిపింది. ఎవరైనా అనాథ వృద్ధులు కనిపిస్తే... 9701046223, 9618340429కు కాల్​ చేసి సమాచారం అందించాలని కోరారు.


ఇదీ చూడండి: 36 ఏళ్ల క్రితం ప్రపంచకప్​ను​ ముద్దాడిన క్షణం..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details