కాల్వపల్లిలో ఘనంగా సదర్ ఉత్సవాలు - యాదాద్రిలో సదర్ సంబురాలు
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం కాల్వపల్లిలో సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
యాదాద్రిలో సదర్ ఉత్సవాలు
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం కాల్వపల్లిలో సదర్ సంబురాలు అంబరాన్నంటాయి. డప్పు చప్పుళ్లు, మంగళ వాద్యాల మధ్య ఆటపాటలతో దున్నపోతును ఊరేగించారు. తెలంగాణ సంప్రదాయంలో భాగంగా సదర్ ఉత్సవాలు శ్రీకృష్ణుని వంశమైన యాదవులు జరపడం ఆనవాయితీగా వస్తోందని యాదవ సంఘం సభ్యులు అన్నారు. ఆ వసుదేవుడి ఆశీర్వాదంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు.