మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారయత్నం - attempt
దివ్యాంగులను చూస్తే జాలిపడతాం. తోచిన సహాయం చేస్తాం. కానీ విచక్షణ కోల్పోయిన యువకుడు మానసిక స్థితి సరిగా లేని యువతిపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఆడదైతే చాలు అవసరాన్ని తీర్చేసుకుందామనుకున్నాడు.
అత్యాచారయత్నం
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న మానసిక దివ్యాంగురాలిపై యువకుడు అత్యాచారాయత్నం చేశాడు. అలికిడి లేచిన తల్లి కేకలతో అతడు పరారయ్యాడు. ఫిర్యాదు మేరకు నిందితుడిని వలిగొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చికిత్స కోసం బాధితురాలని రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.