యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి అనుబంధ ఆలయం శ్రీయోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో రాజగోపుర చక్ర శిఖర లఘు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. దబ్బగుంటపల్లి ఆలయంలో సోమవారం ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షా బంధనం వంటి ప్రత్యేక పూజలు జరిపారు.
శ్రీలక్ష్మీనరసింహ స్వామి రాజగోపుర శిఖర ప్రతిష్ఠ - తెలంగాణ వార్తలు
యాదాద్రి పుణ్యక్షేత్రంలోని అనుబంధ ఆలయం శ్రీయోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో రాజగోపుర శిఖర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ ఉదయం ప్రధాన గోపుర శిఖర చక్ర ప్రతిష్ఠ జరపనున్నట్లు అర్చకులు తెలిపారు.
రాజగోపుర శిఖ ప్రతిష్ఠ కార్యక్రమం, శ్రీయోగనంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం
జలాధివాసం, ధాన్య ధివాసం, మూల మంత్ర హోమం, లఘు పూర్ణాహుతి మొదలగు కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇవాళ ఉదయం ప్రధాన గోపుర శిఖర చక్ర ప్రతిష్ఠ జరపనున్నట్లు అర్చకులు తెలిపారు.
ఇదీ చదవండి:నెలసరి వేళ... వ్యాక్సిన్ వేయించుకోవచ్చా?