యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ గ్రంథాలయానికి భారత రైల్వే బోర్డు మెంబర్ కొణతం నాగార్జునరెడ్డి పూర్వీకుల జ్ఞాపకార్థం రెండు అలమరాలు, 20 పుస్తకాలను అందజేశారు. గ్రంథాలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆయన కోరారు.
గ్రంథాలయానికి పుస్తకాలు బహుకరించిన రైల్వే బోర్డు మెంబర్ - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా సమాచారం
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ గ్రంథాలయానికి రైల్వే బోర్డు మెంబర్ కొణతం నాగార్జున రెడ్డి పుస్తకాలను, రెండు ఆలమరాలను అందజేశారు. పూర్వీకుల జ్ఞాపకార్థం పుస్తకాలను అందించినట్లు తెలిపారు. గ్రంథాలయ అభివృద్ధికి ప్రతిఒక్కరు సహకరించాలని కోరారు.
గ్రంథాలయానికి పుస్తకాలు బహుకరించిన రైల్వే బోర్డు మెంబర్
గ్రంథాలయంలో పుస్తకాలను చదివి ప్రతిఒక్కరు విజ్ఞానం పెంచుకోవాలన్నారు. భవిష్యత్తులో గ్రంథాలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఛైర్మన్ కోమటి మత్స్యగిరి, వైస్ ఛైర్మన్ పోలినేని స్వామిరాయుడు, కార్యదర్శులు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.