MLA Raghunandan Rao Comments On KTR: మునుగోడులో భాజపా అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసమే పార్టీ మారారని మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలను భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఖండించారు. తెరాసలో చేర్చుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏ కాంట్రాక్టులు ఇచ్చారని ప్రశ్నించారు. సంస్థాన్ నారాయణపురంలో ఆయన ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మునుగోడును దత్తత తీసుకుంటామన్న కేటీఆర్‌కు ఇన్నేళ్ల తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి గుర్తుకువచ్చిందా అని రఘునందన్‌రావు ప్రశ్నించారు.
"సిరిసిల్ల, సిద్దిపేట, నారాయణఖేడ్, పాలేరు అయిపోయింది. ఇప్పుడు మునుగోడును దత్తత తీసుకుంటామని బయలుదేరారు. 8 సంవత్సరాల నుంచి చేసింది ఏమిటి. ఇప్పుడు ఏడాదిన్నర కాలం లేదు. ఇప్పుడు దత్తత అంటున్నారు. బూత్‌కు ఒక ఎమ్మెల్యే, మంత్రిని ఎందుకు నియమించారు. పైసలు అన్ని గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల పోతున్నాయి. ప్రజలకు సమాధానం చెప్పాలి. మునుగోడుకు కేటీఆర్ మూడుసార్లు రాలేదు. 119 నియోజకవర్గాలను సమదృష్టితో చూడాలనే భావన మీకు లేకపోవడం దురదృష్టకరం. ఎప్పుడు ఎన్నికలు వస్తే అక్కడ దత్తత తీసుకుంటామని అంటారు. దుబ్బాకతోటి ప్రగతిభవన్ తలుపులు తెరిపించాం. హుజూరాబాద్తోటి ఫాంహౌస్ గేట్లు తెరిపించాం. ఇప్పుడు మునుగోడులో గెలిస్తే ముఖ్యమంత్రి ప్రజల ముందుకు వచ్చే పరిస్థితి నెలకొంటది." -రఘునందన్‌రావు, భాజపా ఎమ్మెల్యే