తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో మంగళవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి, అమ్మవార్లకు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజలు చేపట్టారు. అర్చకులు లక్ష పుష్పార్చన పూజ విశిష్టతను భక్తులకు తెలియజేశారు.
ఏకాదశి పర్వదినాన యాదగిరీశునికి విశేష పూజలు - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామి, అమ్మవార్లకు మంగళవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
ఏకాదశి పర్వదినాన యాదగిరీశునికి విశేష పూజలు
సుప్రభాత సేవలతో ఆలయాన్ని తెరిచిన అర్చకులు, అభిషేకం, ఆరాధన, సహస్రనామార్చన, అష్టోత్తర పూజలు చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, వేద మంత్రోచ్ఛారణల నడుమ పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామిని దర్శించుకున్నారు.
ఇదీ చదవండి:సర్వం… సుందరం…నిర్మాణ శోభితంగా యాదాద్రి క్షేత్రం..!!