తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎల్‌ఆర్‌ఎస్' విధానాన్ని రద్దు చేయాలంటూ నిరసన - ఎల్‌ఆర్‌ఎస్ పై వ్యతిరేకత

ఎల్‌ఆర్‌ఎస్ విధానానికి వ్యతిరేకంగా యాదగిరిగుట్టలోని డాక్యుమెంట్ రైటర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిరసనకు దిగారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పాత పద్ధతిలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.

Breaking News

By

Published : Dec 16, 2020, 4:58 PM IST

ఎల్‌ఆర్‌ఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ..యాదగిరిగుట్టకు చెందిన డాక్యుమెంట్ రైటర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. గత మూడు నెలలుగా కొనసాగుతోన్న నూతన విధానం వల్ల ఎంతో మంది జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

నిరసన కారులు కార్యాలయం ఎదుట వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎల్‌ఆర్‌ఎస్ విధానం అమల్లోకి వచ్చినప్పటినుంచి తమకు ఉపాధి కరవైందని వాపోయారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పాత పద్ధతిలోనే కొనసాగించాలని కోరారు. వాటిపై ఆధారపడ్డ లక్షల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇది చదవండి:ఆ మూడు రాష్ట్రాలు సహా కేంద్రం, సీబీఐకి సుప్రీం నోటీసులు

ABOUT THE AUTHOR

...view details