యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంతో భవిష్యత్ ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందడం అందరినీ కలచివేసింది. మృతుల కుటుంబాల్లో తీరని వేదనని మిగిల్చింది. ప్రమాదంలో రవి కిరణ్, కార్తిక్, వెంకటేశ్ అక్కడికక్కడే మృతి చెందగా... ఆసుపత్రికి తరలిస్తుండగా కల్యాణ్ రెడ్డి మరణించాడు.
మృతుల వివరాలు...
మృతుల్లో రవికిరణ్ కుటుంబం మల్కాజిగిరిలోని ఇందిరానగర్‌లో నివసిస్తోంది. రవి కిరణ్ తండ్రి 12 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, రవి కిరణ్ తల్లి ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తూ కుమారుడు, కూతురును కష్టపడి చదివిస్తోంది. కుమారుడు తమ కుటుంబానికి ఆసరాగా నిలబడతాడనుకుంటే మృత్యువు కబళించిందని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
గోరుకంటి కార్తిక్... ఘట్కేసర్ మండలం కొండాపురం గ్రామం కాగా... కుటుంబ సభ్యులందరూ సమీప బంధువుల ఇంట్లో వివాహానికి వెళ్లారు. కార్తిక్‌ను కూడా వివాహానికి రమ్మని పిలవగా మిత్రుని సోదరి వివాహానికి వెళ్తానని చెప్పి వెళ్లి మృత్యువాత పడ్డాడు. తమతో పాటు బంధువుల ఇంట్లో వివాహానికి వచ్చి ఉంటే కార్తిక్ ప్రాణాలు నిలబడేవని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.