యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో కరోనా పరీక్షలు(Covid test) నిర్వహించగా.. గడిచిన రెండు రోజుల్లో దాదాపు 28 పాజిటివ్ కేసులు(Corona positive) నమోదయ్యాయి. ఈ సందర్భంగా ఆ గ్రామంలో క్రియాశీల కేసులు 58కి చేరాయి. దీంతో గ్రామ సర్పంచ్ పేలపూడి మధు, అధికారులు ఎస్సీ కాలనీలో పర్యటించి శానిటైజ్ చేశారు.
గ్రామంలో కరోనా కేసులు ఎక్కువగా రావడం వల్ల జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ఆదేశాల మేరకు గ్రామంలో రెండు వారాలు లాక్డౌన్(Lock down) విధించారు. లాక్డౌన్(Lock down)కు గ్రామస్థులు సహకరించాలని కోరారు.